test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రధాని పర్యటన వేళ .. బెంగళూరులో జిలెటిన్ స్టిక్స్ లభ్యం

10 మే, 2026

gelatin-sticks-available-in-bangalore-during-prime-ministers-visit
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 10, 2026, 03:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బెంగళూరు : కర్నాటకలోని బెంగళూరులో నిర్వహించిన బిజెపి సభలో ప్రధాని నరేంద్ర మోడి పాల్గొన్నారు. ఆయన సమావేశానికి హాజరుకావడానికి ముందు వేదికకు 3 కిలోమీటర్ల దూరంలోని కగలిపురలో రెండు జిలెటిన్ స్టిక్స్ లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. బాంబు నిర్వీర్వ దళాలు వాటిని అక్కడి నుంచి తరలించాయని చెప్పారు. వాటిని అక్కడ పెట్టినట్లు భావిస్తున్న ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. దీంతో అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతంలో విస్తృత సోదాలు నిర్వహించారు. ప్రధాని మోడి వేదిక వద్దకు చేరుకోవడానికి ముందు ఆయన కాన్వాయ్ వచ్చే మార్గంలో నిర్వహించిన సాధారణ భద్రతా తనిఖీల్లో ఈ జిలెటిన్ స్టిక్స్ను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టామని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్