తెలంగాణ : దేశాభివృద్ధిలో సైబరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని నరేంద్ర మోడి అన్నారు. అనేక పెద్ద ప్రాజెక్టులు ఇక్కడ పురుడు పోసుకుంటున్నాయని చెప్పారు. ఆదివారం తెలంగాణలో పర్యటిస్తున్న ప్రధాని మోడి …. హెచ్‌ఐసీసీలో రూ.9,377 కోట్లతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘సైబరాబాద్ అతి పెద్ద ఉపాధి కేంద్రంగా మారింది. సైబర్ టెక్నాలజీ, విద్యుత్, ఈవీ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. వరంగల్‌లో పీఎం మిత్ర టెక్స్‌టైల్ పార్కును ప్రారంభించుకోవడం సంతోషకరం. దేశ టెక్స్‌టైల్ రంగంలో ఇది కీలకపాత్ర పోషించనుంది. దీంతో భారీగా ఉద్యోగావకాశాలు వస్తాయి. జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర రూ.లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. దీని ద్వారా తెలంగాణ కూడా లాభపడుతోంది’’అని మోడి అన్నారు. జహీరాబాద్‌లో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు(వ్యయం రూ.2,360.54 కోట్లు), జాతీయ రహదారి 167 విస్తరణలో భాగంగా గుడెబల్లూర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు పనులు(విలువ రూ.3,175 కోట్లు), వరంగల్‌లోని ‘పీఎం మిత్ర’ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు(రూ.1,695.54 కోట్లు), హైదరాబాద్ సమీపంలోని మల్కాపూర్ వద్ద నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ పీవోఎల్(రూ.611 కోట్లు), 118 కి.మీ. కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టు(రూ.1,243 కోట్లు), 21 కి.మీ. కాజీపేట రైల్ అండ్ రైల్ బైపాస్ రైల్వే లైను(రూ.292 కోట్లు) ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు.
దేశాభివృద్ధిలో సైబరాబాద్ కీలక పాత్ర పోషిస్తోంది : ప్రధాని మోడి
10 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 10, 2026, 04:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)