ఆదివారం హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ-ప్రజలు ఖర్చు తగ్గించుకోవాలి. బంగారం కొనవద్దు-అని చెప్పారు. సంతోషం. ప్రజలు ఖర్చు తగ్గించాలి. ప్రధాని మాత్రం విచ్చల విడిగా లక్షలు ఖరీదు చేసే సూట్లు ధరించాలా! జాతిపిత గాంధీ ఒక్క పంచతో దేశమంతా తిరిగేవాడు. నెహ్రూ ఎంత సింపుల్ గా ఉండేవాడు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎలా ఉండేవాడు ? తాము చెప్పేదాన్ని ఎవరైతే ఆచరిస్తారో, వెనుకవారు అనుసరిస్తారు. చెప్పేదొకటి చేసేదొకటిగా ఉంటే ఎవరూ నిన్ను అనుసరించరు. ఇది ప్రధానమంత్రి తెలుసుకోవాలి. పటేల్ విగ్రహం రూ. మూడు వేల కోట్లు పెట్టి నిర్మించడం ఇపుడు మన పేద దేశానికి అవసరమా! వందల కోట్లతో నిన్నటి నుండి రాజముద్రతో సోమనాథ్ దేవాలయ ఫుల్ పేజీ ప్రకటనలు వస్తున్నాయి. ఇది ఎవరి సొమ్ము? ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బును ఇలా మతపరమైన ప్రచారాలకు ఖర్చు చెయ్యటం పొదుపులో భాగమా! రాజ్యాంగ విరుద్ధం కాదా!! పాత దేవాలయాలను పునర్నిర్మించటం కాదు చెయ్యవలసింది. మ్యూజియంల లాగా చెయ్యాలి. వెయ్యేళ్ళ చరిత్రగల సోమనాథ్ దేవాలయాన్ని కూడా అలా చేయండి. ఆచరణ లేని ప్రకటనలు చెయ్యకూడదు.
– నార్నె వెంకట సుబ్బయ్య








కామెంట్‌లు (0)