చెన్నై : నలుగురు మాజీ అన్నాడిఎంకె ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినట్లు తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జె.సి.డి. ప్రభాకర్ పేర్కొన్నారు. చెన్నైలోని సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ విప్ ఆదేశాలను ధిక్కరించి, మే 13న జరిగిన విశ్వాస పరీక్షలో అప్పటి ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడంతో వారికి నోటీసులిచ్చినట్లు తెలిపారు. నోటీసులు జారీ చేసినప్పటి నుండి వారం రోజుల్లోగా ఆ నలుగురు మాజీ ఎమ్మెల్యేలు వివరణనివ్వాల్సి వుంటుందని అన్నారు. ఎస్.జయకుమార్, పి.సత్యభామ, మరకతం కుమారవేల్, ఎసాకి సుబయాలు విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన అనంతరం వారు తమ శాసన సభ్యత్వాలకు రాజీనామా చేసి, టివికెలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నలుగురు మినహా మిగిలిన 21మంది రెబల్ ఎమ్మెల్యేలు రాజీపడటంతో, అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి కె. పళనిస్వామి వారిని పార్టీలో కొనసాగేందుకు అనుమతించారు.
నలుగురు మాజీ అన్నాడిఎంకె ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 12, 2026, 04:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)