test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇరాన్‌పై అమెరికా భారీ వైమానిక దాడులు

5 రోజుల క్రితం

war
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 10, 2026, 08:27 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా యుద్దానికి దారితీశాయి. తమ సైన్యానికి చెందిన అపాచీ హెలికాప్టర్‌ను ఇరాన్ కూల్చేసిందని అమెరికా ఆరోపిస్తోంది. ఒమన్ తీరం వెంబడి, హార్ముజ్ జలసంధి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున గస్తీ నిర్వహిస్తుండగా.. అమెరికా మిలిటరీ హెలికాప్టర్ ‘ఏహెచ్-64 అపాచీ’ (AH-64 Apache) కూలిపోయింది. ప్రమాదం నుంచి అందులోని ఇద్దరు పైలట్లు డ్రోన్ బోట్ సహాయంతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ అన్యాయమైన దురాక్రమణకు ఖచ్చితంగా సమాధానం ఇస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా  హెచ్చరించారు. ఆ హెచ్చరికల సన్నద్ధతతోనే.. హెలికాప్టర్ కూల్చివేతకు ప్రతీకారంగా అమెరికా బలగాలు ఇరాన్‌పై శక్తిమంతమైన వైమానిక దాడులను ప్రారంభించాయి. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు యూఎస్ కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఈ దాడులు ప్రారంభమైనట్లు ‘యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్’ అధికారికంగా ధృవీకరించింది. అమెరికా ఫైటర్ జెట్లు జరిపిన ఈ దాడుల కారణంగా దక్షిణ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్, క్వెష్మ్ ద్వీపం, సిరిక్, జాస్క్ కౌంటీలలో భారీ పేలుళ్లు సంభవించాయని, దీంతో ఇరాన్ తన వాయు రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేసిందని స్థానిక మీడియా వెల్లడించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్