అమరావతి : వారం రోజుల్లో ఎపిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ మాట్లాడుతూ …. నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకొని శ్రీలంక పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందన్నారు. రాగల 48 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశాలున్నాయని తెలిపారు. అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని చెప్పారు. ఫలితంగా వారం రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. సోమవారం కోస్తా జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని తెలిపారు. గడిచిన 24 గంటల్లో అల్లూరి జిల్లా పాడేరులో అత్యధికంగా 3.24 సెం.మీ వర్షపాతం నమోదైందని వివరించారు.
RAINS – వారం రోజుల్లో ఎపి లో వానలు
11 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 11, 2026, 05:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)