test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పొంగిపొర్లిన పుల్లేరు వంక – నిలిచిన రాకపోకలు

01 జూన్, 2026

Pulleyeru Stream Overflows — Traffic Halted
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 01, 2026, 12:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – ముద్దనూరు (కడప) : ఆదివారం అర్ధరాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లాయి. ముద్దనూరు పులివెందుల రహదారి లోని టెలిఫోన్ ఎక్సైంజ్ సమీపంలో ఉన్న పుల్లేరు వంక పొంగి పొర్లింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పులివెందుల – ముద్దనూరుకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. పులివెందులకు వెళ్లాల్సిన వాహనాలు, వాహనదారులు, ప్రయాణికులు ముద్దనూరు నుంచి ఎర్రగుంట్ల, వేంపల్లి మీదుగా ప్రయాణం సాగించారు. ముద్దనూరు నుంచి పులివెందుల మీదుగా హిందూపురం వరకు 716 జి నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణం పనులు జరుగుతున్నాయి. నల్లబల్లె వద్ద బ్రిడ్జి పనులు చేస్తుండటంతో పక్కన తాత్కాలికంగా మట్టి రోడ్డు ఏర్పాటు చేశారు. వాగు ధాటికి తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్