ప్రజాశక్తి (ప్రొద్దుటూరు అర్బన్ ): డ్రైనేజీని శుభ్రం చేయండి మహాప్రభో అని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. నెల 22 వ తేదీ నుండి 28 వ తేది వరకు ఎపి ప్రభుత్వం ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ప్రధాన రహదారులు, అంతర్గత వీదులు, పారిశుద్ధ్య లోపాలు, మున్సిపల్ సర్వేలో గుర్తించిన రెడ్ అండ్ ఎల్లో స్పాట్లను ఎక్కువగా చెత్త పేరుకు పోయే ప్రాంతాలు, డ్రైనేజీ కాలువలను శుభ్రపరచడం వంటి అంశాలను ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో చేర్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. పొద్దుటూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్ మొదలుకొని తహసిల్దార్ ఆఫీస్ వరకు రహదారి ప్రక్కన ఉన్న డ్రైనేజీ కాలువలు మాత్రం ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో చేర్చారా లేదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ డ్రైనేజీ కాలువ చెత్తా,చెదారం, ప్లాస్టిక్ బాటిల్స్ తో నిండిపోయింది. ఆ కాలువను శుభ్రపరచకపోవడం వలన చిన్నపాటి వర్షానికే రోడ్ల మీదికి నీరు వచ్చి వాహనదారులను, పాదచారులను ఇబ్బందులకు గురిచేస్తుంది. మురికి నీరు నిల్వ ఉండడం వలన దోమలు ఎక్కువ అయ్యి మలేరియా, టైఫాయిడ్ వంటి రోగాలు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువలను శుభ్రపరచాలని ప్రజలు కోరుకుంటున్నారు.
డ్రైనేజీని శుభ్రం చేయండి మహాప్రభో
28 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 28, 2026, 04:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)