test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉపాధి వేతన బకాయిలు తక్షణమే విడుదల చేయాలి

23 మే, 2026

upadhi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 23, 2026, 12:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం: ఉపాధి వేతన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాది హామీ పనుల పర్యటనలో భాగంగా శనివారం ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు తాడేపల్లిగూడెం మండలం నందమూరి గ్రామంలో పర్యటించారు. ఉపాధి పని ప్రదేశంలో కూలీలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 48 డిగ్రీల ఎండలో కనీసం మంచినీళ్లు మజ్జిగ సౌకర్యాలు లేక ఉపాధి కూలీలు అనేక అగచాట్లు పడుతున్నారని, ఎండ వేడి తాళలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే గ్రామపంచాయతీ బాధ్యత తీసుకుని మజ్జిగ మంచినీళ్లు సదుపాయం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరాములవెంకట రామారావు, మెరిపే పండు, గడ్డం బ్రహ్మానందం, నాగయ్య, జి.ముత్యాలమ్మ, దిరు సుమర్రు నాగరత్నం, టి. కళావతి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్