జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
ప్రజాశక్తి-భీమవరం : జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని సోమవారం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధాంతం గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మొత్తం పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమై ఉండటంతో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సంబంధిత కార్యాలయాలకు అర్జీల సమర్పణ కోసం రావద్దని ప్రజలు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.








కామెంట్‌లు (0)