test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఐరిస్ మస్టర్ విధానాన్ని రద్దు చేయాలి: ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

18 మే, 2026

ఐరిస్ మస్టర్ విధానాన్ని రద్దు చేయాలి: ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 18, 2026, 12:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అల్లంపురం(పశ్చిమగోదావరి): ఉపాధి హామీ పనుల్లో కూలీల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ‘ఐరిస్ మస్టర్’ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెంటపాడు మండలం అల్లంపురం గ్రామంలో సోమవారం ఆయన పర్యటించి, ఉపాధి కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూలీలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ, గతంలో వేసవి తీవ్రతను తట్టుకునేందుకు కల్పించిన మజ్జిగ, మంచినీరు, నీడ వంటి కనీస సౌకర్యాలను ప్రస్తుతం ప్రభుత్వం తొలగించిందని సోమరాజుకు వివరించారు. తక్షణమే ఆ సౌకర్యాలను పునరుద్ధరించాలని కూలీలు నినాదాలు చేశారు. అనంతరం సోమరాజు మాట్లాడుతూ.. ఇటీవల కాకినాడ జిల్లాలో సర్వర్ పని చేయకపోవడంతో, ఐరిస్ మస్టర్ వేయించుకోవడం కోసం రోడ్డుపైకి వచ్చిన ఉపాధి కూలీలపైకి లారీ దూసుకెళ్లిన ఘటనను గుర్తుచేశారు. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, చికిత్స పొందుతూ మరొకరు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, మరణించిన కూలీల కుటుంబాలకు తక్షణమే రూ. 25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధి కూలీల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా ఈనెల 20వ తేదీన చేపట్టబోయే ‘గ్రామ సచివాలయాల ముట్టడి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కూలీలందరూ ఈ పోరాటానికి సన్నద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, కూలీలు రాయిపురెడ్డి అనురాధ, ప్రయోగాల పద్మ, పుచ్చకాయల ధర్మారావు, వాసనపల్లి నారాయణరావు, పి. అలివేలు, ఆకుల సరోజిని, ఎం. రాజు, సంఘం పెద్దిరాజు, అంగర సత్యనారాయణ, కట్ట నాగబాబు, పెనుమర్తి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్