ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు ఇచ్చే వేతనం మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఇంతవరకు ఇచ్చేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 40% వాటా ఇవ్వాలని తరువాత కేంద్రం 60% వాటా ఇస్తుందని కేంద్రం నిర్ణయించడం అత్యంత దూర్మార్గమైన చర్య అని, ఎప్పటి లాగే ఉపాధి హామీ కూలిల వేతనాలు మొత్తం కేంద్రం మే ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు. బుధవారం కొండకరకం గ్రామంలో ఉపాధి కూలీలతో జరిగిన సభలో అయన మాట్లాడుతూ రాష్ట్రా లపైన ఆర్ధిక భారం మోపడం సరైన చర్య కాదని అన్నారు. ఆలా చెయ్యడం అంటే ఉపాధి హామీపథకాన్ని దెబ్బ తీయడమేనని అందుకే ఉపాధి హామీ పథకం రక్షించు కోనెందుకు కూలిలంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. జూట్ మిల్లుపై ఆధారపడి జీవించే కార్మికులకు జూట్ మిల్ మూసేసి ఉపాధి లేకుండా చేశారన్నారు. ఇప్పుడు ఉపాధి హామీని దెబ్బ తీసి బతుకు లేకుండా చేస్తున్న కేంద్రప్రభుత్వం విధానాన్ని త్రిప్పి కొట్టాలని రెడ్డి శంకరరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు బుర్లి. రమణ, కార్మికులు పాల్గొన్నారు.
‘ఉపాధి’ వేతనాలు కేంద్రమే ఇవ్వాలి
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 03, 2026, 01:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)