ప్రజాశక్తి-విజయనగరం కోట : కొండల తవ్వకాలు ఆపాలని కోరుతూ …. పూసపాటి రేగ మండలం, పతివాడ, రాయుడుపేట, చిన్న పతివాడ, బర్రిపేట, తమ్మయ్య పాలెం గ్రామ ప్రజలు సోమవారం ఆందోళన చేపట్టారు. ‘ మా ఊరును ఆనుకొని ఉన్న రెండు కొండలను తవ్వొద్దు ` అంటూ … ఈరోజు గ్రీవెన్స్ లో వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ … ఈ రెండు కొండల మీద అనేక వందల వన్యప్రాణులు ఉన్నాయి వాటిని కాపాడాలి వాటిని కాపాడితేనే రేపటి తరంకు మన అన్నవాళ్లు వాటి ఆనవాళ్లు తెలుస్తాయన్నారు. అదే విధంగా ఈ రెండు కొండలను ఆనుకొని మూడు పెద్ద చెరువులు ఉన్నాయనీ, కొండ దారకొండ వచ్చే వర్షపు నీరు పడి చెరువులు పుష్కలంగా నిండి తమ గ్రామాల కింద ఉన్న వందల ఎకరాల భూములకు వ్యవసాయ ఆధారంగా ఉంటాయి అని తెలిపారు. ఈ కొండలను తవ్వడం వలన వాటిని కోల్పోయి వ్యవసాయం లేకుండా పోతుందన్నారు. వన్యప్రాణులు ఆశ్రయాన్ని కోల్పోతాయన్నారు. ఇక్కడ కొండలను అనుకొని ఎన్టీఆర్ కాలనీ అనేక లేఅవుట్లు ఉన్నాయనీ వీటన్నిటిని కాపాడాలని కోరారు.
కొండల తవ్వకాలు ఆపండి.. వన్యప్రాణులను కాపాడండి ….
6 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 01, 2026, 01:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)