ప్రజాశక్తి-విజయనగరం కోట : నీట్ పేపర్ లీకేజీ విషయంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్ జీ డిమాండ్ చేశారు. శనివారం ఉదయం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఇన్ గేట్ వద్ద ఎఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాసర్ జి మాట్లాడుతూ …. నీట్ సంవత్సర క్రితమే లీకేజీ జరిగినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఇది ముమ్మాటికి ఎన్డీఏ ప్రభుత్వం వైఫల్యమేనన్నారు. విద్యాశాఖ మంత్రిపై చర్యలు తీసుకోకపోతే ఆయన వెంటనే రాజీనామా చేయకపోతే ఎఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నాగభూషణ్, సహయ కార్యదర్శి గౌరీ శంకర్, ఉపాధ్యక్షులు సుమన్, పట్టణ కార్యదర్శి గణేష్, రాము, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి ధర్మేంద్రప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి లేకపోతే చలో ఢిల్లీ : ఎఐఎస్ఎఫ్
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 06, 2026, 01:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)