ప్రజాశక్తి-విజయనగరం కోట : ఉపాధి హామీ కూలీలకు హెచ్ఐవి, ఎయిడ్స్ సుఖ వ్యాధి పరీక్షలను ఐ సి టి సి సిబ్బంది నిర్వహించారు. సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల కొండకారకం గ్రామంలో మొబైల్ ఐ సి టి సి ఆధ్వర్యంలో రక్త పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా హెచ్ఐవి, ఎయిడ్స్, సుఖ వ్యాధులు, టీబీ, బిపి వ్యాధులపై అవగాహన కల్పించి రక్త పరీక్షలు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన కలిగి ఉండాలని రక్త పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. మొబైల్ ఐ సి టి సి కౌన్సిలర్ సిహెచ్ కోటారావు మాట్లాడుతూ … హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి ఉన్నవారిపట్ల వివక్షత చూపకుండా మంచి భావంతో మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం లక్ష్మి, ఎం ఎల్ హెచ్ పి మౌనిక, మొబైల్ ఐ సి టి సి ల్యాబ్ టెక్నీషియన్ కే. అప్పలనాయుడు, లింక్ వర్కర్ పైడితల్లి ఐ సి టి సి స్టాప్ పాల్గొన్నారు.
ఉపాధి కూలీలకు హెచ్ఐవి ఎయిడ్స్ సుఖ వ్యాధుల పరీక్షలు
25 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 25, 2026, 11:32 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)