ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ : విశాఖపట్నం ద్వారకా ఆర్టీసీ కాంప్లెక్స్‌లో శనివారం ఇద్దరు కిలాడీ మహిళలు చేతివాటం ప్రదర్శించారు. కాకినాడ వెళ్లేందుకు బస్సు ఎక్కుతున్న ఓ మహిళా ప్రయాణికురాలిని లక్ష్యంగా చేసుకుని, తోపులాట మధ్య ఆమె బ్యాగులో ఉన్న 35 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. బస్సు ఎక్కుతున్నట్లు నటిస్తూ అత్యంత చాకచక్యంగా ఈ దొంగతనానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టు టౌన్ పోలీసులు ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని సిసి టీవీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో ఇద్దరు మహిళలు నగలు దొంగిలించిన దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కిలాడీ మహిళల చేతివాటం – ఆర్టీసీ కాంప్లెక్స్ లో చోరీ
18 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 18, 2026, 10:39 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)