నెల్లూరు: కడప జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్రహ స్థాపన సందర్భంగా నెలకొన్న మత ఘర్షణలు, ఉద్రిక్తతల నేపథ్యంలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మతసామరస్యం వర్ధిల్లాలని నెల్లూరులో ర్యాలీ నిర్వహించారు. మతసామరస్యం వర్ధిల్లాలి… లౌకికవాదం వర్ధిల్లాలి.. దేశ సమైక్యతను కాపాడుకుందాం… హిందూ ముస్లిం భాయ్ భాయ్.. హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి… అని నినదిస్తూ నెల్లూరు అపోలో హాస్పిటల్ సెంటర్ నుండి చిల్డ్రన్స్ పార్క్ జంక్షన్ మీదుగా ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు, పూర్వ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం, మూలం రమేష్, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి చిస్టీ, తదిరతులు పాల్గొన్నారు.
నెల్లూరులో మతసామరస్య ర్యాలీ
10 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 10, 2026, 12:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)