test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ముందు బిల్లులు.. తర్వాతే పనులు..

5 రోజుల క్రితం

manyam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 03, 2026, 10:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-మక్కువ : మక్కువ మండలంలోని వెంకటపరపురం నుండి తూరుమామిడి బి .టి. రోడ్డు పనుల్లో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర ప్రచారణ చేపట్టి, చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కే గంగు నాయుడు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక రహదారి పనులు పరిశీలన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకట బైరపురం నుండి తూరుమామిడి వరకు 3.60 కిలోమీటర్ల బీటీ రోడ్డు మూడు కోట్ల 60 లక్షలు రూపాయలు ఉపాధి హామీ పథకంలో మంజూరయ్యాయని తెలిపారు. ఈ పనుల్లో ప్రారంభం నుండి పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన ఉన్నతాధికారులు కనీసం పట్టించుకోకపోవడం వలన సుమారు కిలోమీటర్లు బీ.టీ .రోడ్డు వేయకుండానే వేసినట్లు, ముందుగా బిల్లులు జనరేట్ చేసి ఇప్పుడు ఆదిరాబాదరాగా పనులు చేయడానికి కారణమేమిటని ప్రశ్నించారు. మార్చి 25 నాటికి పనులు పూర్తి చేసి ఎం బుక్కులు చేయాలని జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి గతంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ పనులు ఎందుకు పెండింగ్ ఉన్నాయని ప్రశ్నించారు. మేము చెబుతున్నట్టు ముందుగా జిల్లాలో ఎంబుక్కులు రికార్డులు చేసి తరువాత పనులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని వెంకట బైరపురం తూరూమామిడి రోడ్డు దానికి ఉదాహరణ అని అన్నారు. గత రాత్రి నుండి రోడ్డుపై మెటల్ స్టోన్స్ వేస్తూ పనులు ప్రారంభిస్తున్నారని దీనిపై జిల్లా కలెక్టర్ సుమోటోగా దర్యాప్తు ప్రారంభించి వెంటనే అవినీతికి పాల్పడిన ఐటీడీఏ ఏఈ ని సస్పెండ్ చేయాలని, జిల్లా మంత్రి సంధ్యారాణి అండతోనే టిడిపి నాయకులు ఈ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ రోడ్డు పనుల్లో కనీస ప్రభుత్వ నిబంధనలు పాటించలేదని ఈ పనులు టెండర్ ప్రక్రియ ద్వారా చేయించాల్సి ఉన్నప్పటికీ, కూటమి నాయకులకు అప్పజెప్పాలన్న దురుద్దేశంతో ఎటువంటి అర్హత లేని వ్యక్తి పేరును మూడు కోట్ల అరవై లక్షలు రూపాయలు పనులను తొమ్మిది భాగాలుగా విడగొట్టి అప్పచెప్పారని విమర్శించారు . ఇది ప్రభుత్వం నిబంధనలకు, ఉపాధి పి.డి .ఇచ్చిన మార్గదర్శకాలకు పూర్తిగా విరుద్ధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని, గతంలో పత్రికా ప్రకటనలు చేసినా ఇంతవరకు ఏ అధికారి దర్యాప్తు చేయలేదని, ఇదంతా అధికార పార్టీ అండతోనే ఈ రోడ్ పనుల్లో రోలింగ్, వాటరింగ్ చెయ్యలేదని దానివలన వేసిన సిమెంట్ రోడ్లు ఇప్పటికే బీటలు వారి పాడైపోతున్నాయని అన్నారు. కాబట్టి వెంకట బైరపురం టు తూరుమామిడి రోడ్డు పనులు పై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే కాకుండా మన్యం జిల్లాలో ఉపాధి హామీ నిధుల్లో భాగంగా జరుగుతున్న పనుల్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, వాటన్నిటిపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లేకపోతే ప్రజలందరినీ కదిలించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మక్కువ మండలం నాయకులు పెట్టాల సీతారాం పిట్టల చినబాబు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్