test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏనుగుల కదలికలపై పర్యవేక్షణ – డిఎఫ్ ఓ సూచనలు

4 రోజుల క్రితం

Monitoring of Elephant Movements — DFO's Instructions
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 03, 2026, 03:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-మక్కువ (మన్యం) : ఏనుగుల గుంపు కదలికలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని డిఎఫ్ఓ ప్రసూన అటవీ సిబ్బందికి సూచించారు. బుధవారం మండలంలోని మార్కొండ పొట్టి పంచాయతీ పరిధిలోని అటవీ సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. మండలంలో గత నాలుగు రోజులుగా ఏనుగుల గుంపు సంచరించడంతో ప్రజలు భయాందోళన చెందుతున్న విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి ఏనుగుల గుంపు రైతుల పంట పొలాలను నాశనం చేయడమే కాకుండా, వ్యవసాయ ఉపకరణ వస్తువులను కూడా ధ్వంసం చేసినట్లు తెలిసింది. మార్కొండపుట్టి, ఎస్ పెద్దవలస పంచాయతీ పరిధిలో ప్రస్తుతం ఏనుగుల గుంపు ఉండటంతో నష్టాల పై అప్పుడే పరిశీలన చేయలేమనీ, ఏనుగులు వాటి దిశ మార్చిన తర్వాత నష్టాల ప్రాంతం వేస్తామన్నట్లు సిబ్బంది డి.ఎఫ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. గ్రామాల్లో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేలా చర్యలు చేపట్టాలని సిబ్బందికి డిఎఫ్ఒ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎలిఫెంట్ మానిటరింగ్ యూనిట్ అధికారి మణికంఠేష్, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్