test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏనుగుల సంచారం – అధికారుల హెచ్చరికలు

6 రోజుల క్రితం

Elephant Movement — Officials' Warnings
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 02, 2026, 11:29 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

దగ్గరకు వెళ్ళవద్దు.. కవింపు చర్యలకు పాల్పడొద్దు..

ఫారెస్ట్ అధికారులు హెచ్చరిక. మార్కొండ పుట్టి పంచాయతీ పరిధిలో ఏనుగులు.

ప్రజాశక్తి-మక్కువ (మన్యం) : మండలంలోని గత నాలుగు రోజులుగా ఏనుగులు గుంపు సంచరిస్తూ ఉందని, కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండి ఏనుగుల దగ్గరకు వెళ్లకుండా ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా ఉండాలని అటవీ అధికారులు మంగళవారం ప్రకటన చేశారు. ప్రస్తుతం మండలంలోని అడారుగడ్డ ప్రాంతాన్ని వదిలి, ఏనుగులు మార్కొండ పుట్టి పంచాయతీలో చిట్టిగెడ్డ పరిసరాల్లో సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పెదగయిసల , కే గైసల, కాకునువానివలస గ్రామాల్లో ముందస్తు చాటింపులు వేయించారు. అటవీ సిబ్బంది, ట్రకర్లు ఎప్పటికప్పుడు ఏనుగుల కదలికలను అనుసరిస్తున్నారని తెలిపారు. ప్రజలకు ఏవిధమైన సమాచరము ఉన్నా తమకు తెలపాలని కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్