test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఇంచార్జ్ కలెక్టర్ సంజన సింహా…

11 మే, 2026

ఇంచార్జ్ కలెక్టర్ సంజన సింహా
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 11, 2026, 07:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-వెల్దుర్తి (పల్నాడు జిల్లా) : వెల్దుర్తి మండల పరిధిలోని రామచంద్రాపురం తండాలో ఒక బాల్య వివాహాన్ని ఇంచార్జ్ కలెక్టర్ సంజన సింహా సకాలంలో స్పందించి, అధికారులను అప్రమత్తం చేయడం ద్వారా విజయవంతంగా అడ్డుకున్నారు. ఈ విషయాన్ని సోమవారం ప్రజాశక్తికి వెల్లడించారు. రామచంద్రాపురం తండాలో ఒక మైనర్ బాలికకు వివాహం జరుగుతున్నట్లు నిన్న అర్ధరాతి 2 గంటలకు సమాచారం అందుకున్న ఇంచార్జ్ కలెక్టర్, వెంటనే సంబంధిత అధికారులను క్షేత్రస్థాయికి వెళ్లాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వెల్దుర్తి తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది, ఎస్.ఐ, ఐ.సి.డి.ఎస్ , చైల్డ్‌లైన్ ప్రతినిధులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ​అధికారులు బాలిక వయస్సు ధ్రువీకరణ పత్రాలను పరిశీలించగా, వివాహానికి చట్టబద్ధమైన వయస్సు నిండలేదని నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు వెంటనే వివాహాన్ని నిలిపివేసి, బాలికను సంరక్షణలోకి తీసుకున్నారు. పిల్లల బంగారు భవిష్యత్తును నాశనం చేసే బాల్య వివాహాలను జరపవద్దని ఇంచార్జ్ కలెక్టర్ సంజనా సింహా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం వివాహానికి బాలికలకు 18 ఏళ్లు, బాలురకు 21 ఏళ్లు నిండడం తప్పనిసరి అన్నారు. నిబంధనలు అతిక్రమించి బాల్య వివాహాలు చేసే తల్లిదండ్రులు, ఇందుకు సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్