ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లాలో బుధవారం ఉదయం నరసరావుపేట, చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురవగా, వినుకొండ, సత్తెనపల్లిలో కొద్దిపాటి తుంపర వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో కళ్లాలలో ఆరబోసిన మిర్చి, మొక్కజొన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు పరుగులు తీశారు. జిల్లాలో సుమారు 70 శాతం మొక్కజొన్న పంట ఇప్పటికే అమ్ముడై ఉండగా మరో 15 శాతం అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఇంకా 15 నుండి 20 శాతం వరకు నూర్పిడి దశలో ఉన్న పంటపై వర్షం ప్రభావం పడింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునే కీలక సమయంలో వర్షం కారణంగా తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు కొనుగోలు కేంద్రాలు లేక మరో మద్దతు ధర లేక ఆవేదన చెందుతున్న మొక్కజొన్న రైతుల పరిస్థితి బుధవారం నాటి వర్ష ప్రభావంతో మరింత దయనీయంగా మారింది. మిర్చి చివరి కోత దశలో ఉన్న నేపథ్యంలో కాయ తాలుగా మారి రాలిపోవడం, రంగు మారే పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. అకాల వర్షంతో చేతికి వచ్చిన ముద్ద నోటికి అందని పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు.
‘పల్నాడు’లో భారీ వర్షాలు
06 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 06, 2026, 11:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)