ప్రజాశక్తి-పల్నాడు జిల్లా: హైదరాబాద్‌లో వెలుగుచూసిన భూ కబ్జా వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే బొల్లా తనయుడు గిరిబాబు స్పష్టం చేశారు. ఆ భూమికి సంబంధించిన పత్రాలు నకిలీవని తమ బంధువు బొల్లా రమేష్ బయటపెట్టారని తెలిపారు. ఈ కేసులో బొల్లా రమేష్ బాధితుడే తప్ప నిందితుడు కాదన్నారు. బొల్లా రమేష్‌కు చేబదులుగా మాత్రమే డబ్బులు ఇచ్చామని, తమపై రాజకీయ కక్షతో కావాలనే బురద జల్లే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు సంబంధించిన ఫేక్ జీవో కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేయలేమని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది.
హైదరాబాద్ భూ కబ్జా కేసుతో మాకు సంబంధం లేదు : బొల్లా గిరిబాబు
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 04, 2026, 02:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)