ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నరసరావుపేటకు చేరుకున్నారు. బ్రహ్మనాయుడు నివాసంలో తనిఖీలు నిర్వహించారు. అయితే ఆయన ఆచూకీ లభించకపోవడంతో గాలింపు కొనసాగిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ గండిపేట ప్రాంతంలో రూ,1,500 కోట్లకు పైగా విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాకు సంబంధించిన వ్యవహారంలో బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు నమోదైనట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీసీఎస్ పోలీసులు ఆయనను గుర్తించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఘటనకు సంబంధించి అధికారికంగా పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. కేసు దర్యాప్తు కొనసాగుతుంది.
వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కోసం పోలీసుల గాలింపు
6 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 02, 2026, 11:42 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)