ప్రజాశక్తి-మైలవరం : మైలవరం జలాశయంలో వాటర్ డ్రోమ్ నిర్మాణానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం 4వ తేదీన ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నట్లు మైలవరం జలాశయం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తెలిపారు. మైలవరం జలాశయానికి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలు ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. ప్రతిపాదిత వాటర్ డ్రోమ్ నిర్మాణం వల్ల తమకు ఏవైనా ఇబ్బందులు, అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే సమావేశంలో వెల్లడించాలని సూచించారు. అలాగే, సమావేశానికి హాజరైన ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తం కాకపోతే, ప్రతిపాదిత నిర్మాణ పనులకు ప్రజల ఆమోదం ఉన్నట్లుగా పరిగణించి తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అందువల్ల సంబంధిత గ్రామాల ప్రజలందరూ సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజ్ఞప్తి చేశారు.
వాటర్ డ్రోమ్ పై రేపే ప్రజాభిప్రాయ సేకరణ
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 03, 2026, 01:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)