test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈడీ దాడులు

28 మే, 2026

ed-attacks
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 28, 2026, 04:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విస్సన్నపేట :  కేరళ మాజీ సిపిఎం ముఖ్యమంత్రి కామ్రేడ్  విజయన్ పై రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే  ఈడి దాడులు జరిగాయని సిపిఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడి దాడులకు  నిరసనగా గురువారం విస్సన్నపేట స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి విస్సంపల్లి నాగరాజు మాట్లాడుతూ.. కేరళ మాజీ ముఖ్యమంత్రి పై ఈడీ దాడులు అంటే ప్రజాస్వామ్యం పై దాడులు చేయటమేనని అన్నారు.  ఈ దేశంలో అన్నిటికంటే బాగా ప్రతిపక్షాలపై దాడులు చేయటమే కేంద్రం పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. 12ఏళ్ల మోడీ ప్రభుత్వంలో  వారికి అనుకూలంగా ఉన్న ఏ ఒక్క ఎమ్మెల్యే పై గానీ ఎంపీపై గాని ఒక్క ఈడీ దాడి కూడా జరగలేదని  అన్నారు.  ఇది కేవలం ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులు పై కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని అన్నారు.  కేరళలో గత వామపక్ష ప్రభుత్వం ఉన్నంతకాలం ఎక్కడా అవినీతి జరగలేదని, అలాంటి ప్రభుత్వంపై  ఈడి  దాడుల్ని సిపిఎం విస్సన్నపేట మండల కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు.   ఈ కార్యక్రమంలో సిపిఎం విస్సన్నపేట పట్టణ కార్యదర్శి మేకల జ్ఞాన రత్నం, సిపిఎం మండల కమిటీ సభ్యులు ఆడిమిల్లి కిషోర్ శ్రీనివాసరావు, సిఐటియు మండల కన్వీనర్ ఆకుల శ్రీనివాసరావు, కాపీ వర్కర్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గంజిన బోయిన రాము, మర్రిబోయిన అప్పారావు, రాజేష్, రిక్షా వర్కర్ యూనియన్ నాయకులు నాగేశ్వరరావు, దుర్గారావు, సుబ్బారావు, షేక్ రసూల్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్