test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రైవేటు ట్రావెల్ బస్సును ఢీకొట్టిన లారీ – ఒకరు మృతి

17 మే, 2026

ప్రైవేటు ట్రావెల్ బస్సును ఢీకొట్టిన లారీ – ఒకరు మృతి
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 17, 2026, 04:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ఆళ్లగడ్డ (నంద్యాల) : ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందిన ఘటన ఆదివారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో జరిగింది. 40 వ జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న జై భారత్ ట్రావెల్ బస్సు ఆళ్లగడ్డ సమీపంలోని హైవే గార్డెన్ , ఏవి గోడౌన్ మధ్యలో ముందు వెళ్తున్న బొగ్గు లారీని ఢీకొట్టింది . ఈ ప్రమాదంలో బస్సులో ముందు వరుసలో కూర్చున్న L 1 సీటులో ప్రయాణిస్తున్న సుబ్రహ్మణ్యo (45) అక్కడికక్కడే మృతి చెందాడు. అతడిది చిత్తూరు జిల్లా కమ్మవారిపల్లె మండలం కురువపల్లె గ్రామం. బస్సులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని 108 వాహనాల్లో నంద్యాలకు తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. బస్సు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆళ్లగడ్డ పట్టణ సీఐ నాగరాజరావు , ఎస్‌ఐ తమ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకొని ప్రమాదానికి గురైన బస్సులోని ప్రయాణికులను ఇతర బస్సుల్లో వారి గమ్యస్థానాలకు చేర్చారు. కాగా ఆ సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్