test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పేదలు ఉపాధి శ్రామికులు మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాలి : వ్య.కా.స

20 మే, 2026

The poor and unemployed workers should prepare for another independence struggle: V.K.S.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 20, 2026, 04:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

బంగ్లా (నంద్యాల) : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి, జి రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ …. పేదలు ఉపాధి శ్రామికులు మరో స్వతంత్ర పోరాటానికి సంసిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎం కర్ణ పిలుపునిచ్చారు. బుధవారం రోజు జూపాడు బంగ్లా మండలంలోని పారుమంచాల గ్రామ సచివాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కర్ణ హాజరై మాట్లాడుతూ …. గతంలో పేదలు వ్యవసాయ శ్రామికులు తిండైనా పెట్టాలి పనైనా చూపాలి అని ఎర్రజెండా నాయకత్వాన పెద్ద ఎత్తున పోరాడిన ఫలితంగా యూపీఏ 2 లో వామపక్ష ఎంపీలు పార్లమెంటులో ఎక్కువ సంఖ్య ఉన్నందున మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసుకురావడం జరిగిందని ఈ చట్టం వచ్చిన తర్వాత పేదలకు కొంత మెరుగుపడిందని కొనుగోలు శక్తి పెరిగిందని పనులు లేని దినాలలో కడుపు నింపే ఈ చట్టాన్ని ఉద్దేశపూర్వకంగా నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సవరిస్తూ మహాత్మా గాంధీజీని చంపిన వ్యక్తి జి రాంజీ పేరుతో చట్టం చేస్తూ ఆగమేఘాలపై అమలు చేస్తూ అనేక ఆంక్షలు విధించడం పేదలకు ఉపాధి చట్టాన్ని దూరం చేయడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జి రామ్ జి చట్టాన్ని రద్దుచేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేసి రెండు వందల రోజులు పని దినాలు కల్పించి పెరిగిన ధరలకు అనుకూలంగా రోజు వేతనం 700 ఇవ్వాలని పనుల దగ్గర వసతులు కల్పించాలని పనిచేసే వారందరికీ పనిముట్లు ఇవ్వాలని జాబ్ కార్డులు లేని వారికి జాబు కార్డు ఇవ్వాలని తదితర భవిష్యత్తులో ఈ సమస్యను పరిష్కారం కొరకు ఎర్రజెండా చేసే పోరాటాల్లో పేదలు వ్యవసాయ శ్రామికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలిపారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని గ్రామ సెక్రెటరీ శాలుభాష గారికి ఉపాధి శ్రామికులతో కలిసి అందజేశారు. అనంతరం గ్రామ సెక్రెటరీ శాలు భాష మాట్లాడుతూ …. సచివాలయ పరిధిలో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని మిగతా అంశాలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధి మెట్లు రఫీ సూరి సుబ్బరాయుడు నూరువల్లి రంగస్వామి రాంబాబు లలితమ్మ రవణమ్మ ఉపాధి శ్రామికులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్