ప్రజాశక్తి-మార్కాపురం : మార్కాపురం సబ్ జైలును జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ షేక్ ఇబ్రహీం షరీఫ్ బుధవారం తనిఖీ చేశారు .ఈ సందర్భంగా విచారణ ఖైదీలను, వివిధ కేసులలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను, వారి కేసుల వివరములను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. తరువాత జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయమూర్తి మాట్లాడుతూ మానవ జన్మ ను మంచిని, చెడును గ్రహించే విచక్షణ జ్ఞానం మనుషులు కలిగి ఉండాలన్నారు. కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు ఉండాలని, అవి కొరవడిన నాడు మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నమైనప్పుడు సమాజంలో శాంతి ఉండదన్నారు . మనుషులు ఆవేశంతో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి, నిగ్రహం నశించి నేరాలకు పాల్పడుతున్నారని, తద్వారా కుటుంబ సభ్యులను కోల్పోతున్నారని, ప్రతి ఒక్కరు చట్టాలను అతిక్రమించకూడదన్నారు. మత్తు పదార్థాలను వాడిన యువత ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేసుకోవడమే కాక కుటుంబ సభ్యులకు దూరమవుతున్నారని, నిగ్రహం లేక నేరాలకు పాల్పడుతున్నారన్నారని, చేసిన తప్పులకు పశ్చాతాపం చెంది చెడు అలవాట్లను వీడి పటిష్టమైన కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకోవాలన్నారు. బెయిలు ,అరెస్టు ఉచిత న్యాయ సహాయం గురించి అవగాహన కల్పించారు. విచారణ ఖైదీలకు అందుతున్న సదుపాయాలను,వారికి అందుతున్న ఆహారము పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం నందు ప్యానల్ లాయర్లు షేక్ జహీర్ సలాం, సబ్ జైల్ సూపరెండేంట్ ఎం.విజయ్ కుమార్, పియల్వి షేక్ బాషా, కోర్ట్ సిబ్బంది ,జైలు సిబ్బంది పాల్గొన్నారు.
ఆవేశంతో అనర్ధాలు… నిగ్రహం అవసరం…
25 ఏప్రిల్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఏప్రి 25, 2026, 12:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)