test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు కోనసీమ యువకుడు ఎంపిక

4 రోజుల క్రితం

Young Man from Konaseema Selected for the Indian Air Force
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 03, 2026, 05:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమలాపురం (కోనసీమ) : ప్రతిష్టాత్మక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ కు అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నం మిలటరీ కాలనీకి చెందిన యువకుడు ఎంపిక అయ్యాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వై పికేడర్ కు ఈద జోయల్ వెస్లీ (18) ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి ఏకైక అభ్యర్థిగా ఎంపిక అవ్వడం విశేషం. కర్ణాటక లోని బెల్గావి ఎయిర్ మెన్ ట్రైనింగ్ సెంటర్ లో ఆరు నెలల శిక్షణ అనంతరం జోయల్ కు పోస్టింగ్ ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 7000 మంది వరకు అభ్యర్థులు పోటీ పడగా వీరిలో కేవలం 98 మంది మాత్రమే ఎంపిక అయ్యారు. వారిలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి జోయల్ వెస్లీ ఎంపికయ్యాడు. జోయల్ వెస్లీ తండ్రి ఈద ప్రసాద్ (చంటి) సాధారణ ప్రయివేటు ఉద్యోగి కాగా తల్లి ఝాన్సీ లక్ష్మీ అంగన్వాడీ వర్కర్ గా పనిచేస్తోంది. మిలటరీ కాలనీలో పూర్వీకులు చాలా మంది మిలటరీ లో పని చేసిన నేపథ్యం ఉండగా జోయల్ వెస్లీ తాతయ్య పిల్లి ఆనందం కూడా మిలటరీ లో పనిచేయడంతో త్రివిధ దళాల్లో తనకు ఇష్టమైన ఎయిర్ ఫోర్స్ లో పనిచేయాలన్న ఆకాంక్ష తను చిన్ననాటి నుంచి ఉండేదని, అదేవిధంగా మామయ్య అయిన సవల రాజా కూడా కానిస్టేబుల్ గా పనిచేయడంతో ఆయనను చూసి తనలో మరింత స్ఫూర్తిని తీసుకువచ్చిందని జోయల్ వెస్లీ తెలిపాడు. భవిష్యత్తులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉన్నత స్థితికి చేరుకోవడమే తన లక్ష్యం అని వెల్లడించాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు జోయల్ వెస్లీ ఎంపిక కావడం పై స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు గ్రామస్తులు జోయల్ వెస్లీకు, తల్లిదండ్రులకు అభినందలు తెలియజేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్