test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై వైసిపి వినూత్న నిరసన

18 మే, 2026

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై వైసిపి వినూత్న నిరసన
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 18, 2026, 05:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -కొత్తపేట (కోనసీమ) : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసిపి అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కొత్తపేట గ్రామంలో గొల్లపల్లి డేవిడ్ రాజు ఇంటి ఎదురుగా ఉన్న బంక్ వద్ద పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ …. సోమవారం వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా నిత్యావసర ధరలు అమాంతం పెరిగిపోతూ సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కొత్తపేట ఆర్‌డీవో కార్యాలయం వరకు జగ్గిరెడ్డి ఒక రిక్షాపై మోటార్ సైకిల్‌ను ఎక్కించి రిక్షా తొక్కుతూ వినూత్న ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కోరుతూ ఆర్‌డీవో కి వినతిపత్రం అందజేశారు. ప్రజల సమస్యలపై వైసిపి ఎప్పటికీ పోరాటం చేస్తూనే ఉంటుందని జగ్గిరెడ్డి గారు స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాలుగు మండలాల వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్