test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అధికారుల నిర్లక్ష్యం – ఉపాధి కూలీ చికిత్స పొందుతూ మృతి

20 మే, 2026

Official negligence - laborer dies while receiving treatment
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 20, 2026, 05:26 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • కుటుంబానికి 10 లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలనీ బీఎస్పీ నేత పొలమూరి మోహన్ బాబు డిమాండ్

  • ఎంపీడీవో ఉపాధి అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు కోల్పోయిన ఉపాధి కూలీ

ప్రజాశక్తి-అమలాపురం (కోనసీమ) : కేంద్ర బీజేపీ ప్రభుత్యం ఉపాధి హామీ పథకంలో కూలీలను ఇబ్బందులకు గురి చేశాలా ప్రవేశపెట్టిన నూతన విది విధానాలతో స్థానిక అధికారుల నిర్లక్ష్యంతో కాకినాడ రూరల్ మండలంలోని చీడిగ గ్రామానికి చెందిన 5 ఉపాధి హామీ పథకం కూలీలు మృతి చెందిన ఘటన మరువక ముందే డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉప్పలగుప్తం మండలం సరిపల్లి గ్రామం లో ఇదే తరహాలో మరో ఘటన చోటు చేసుకుంది. ఉప్పలగుప్తం మండలంలోని సరిపల్లి గ్రామానికి చెందిన మట్టపర్తి అనంతలక్ష్మి (57) మంగళవారం ఉపాధి పనికి ఆటోలో వెళుతూ ఉండగా ఆమె ప్రయాణిస్తున్న ఆటో నుండి ప్రమాదవశాత్తు పడిపోవడంతో గాయాల పాలయ్యింది. అనంతలక్ష్మిని అమలాపురంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా వైద్యులకు తెలిపిన వివరాల ప్రకారం ఆమె కోమాలోకి వెళ్లిన సంగతి వెలుగులోకి వచ్చింది. బుధవారం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. మృతి చెందిన అనంతలక్ష్మి కి భర్త గతంలోనే చనిపోయారు. ఆమెకు వివాహితుడైన ఒక కుమారుడు ఉన్నాడు. ఉపాధి హామీ పనులు చేసుకుంటూ అనంతలక్ష్మి కుమారుడు వద్ద జీవనం కొనసాగిస్తుంది.

మృతురాలు కుటుంబానికి న్యాయం చేయాలి : బి ఎస్ పి పార్టీ డిమాండ్
ఉపాధి హామీ పథకం పనికి వెళుతూ ఆటో నుండి పడిపోయి గాయాల పాలైన అనంతలక్ష్మికి సరైన సమయంలో అధికారులు వైద్యం అందించలేదని ఎంపీడీవో ఇతర ఉన్నత అధికారుల నిర్లక్ష్యంతో అనంతలక్ష్మి మృతి చెందిందని ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని బీఎస్పీ నేత పొలమూరి మోహన్ బాబు అధికారులకు కోరారు. కనీసం జిల్లా అధికారులు సైతం ఎవరూ కూడా ఆమెకి న్యాయం చేయలేదని ఆయన ఆవేదన చెందారు. పేదల ప్రాణాలు గాలికి వదిలేసి పని ప్రదేశంలో కల్పించవలసిన కనీస సౌకర్యాలు కల్పించడం లేదని తక్షణమే ప్రభుత్వ అధికారులు మట్టపర్తి అనంతలక్ష్మీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు నష్టపరహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్