test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వేగుళ్ల శంఖుస్థాపన

18 మే, 2026

mla vegulla.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 18, 2026, 01:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - మండపేట: మండపేట మండలంలోని కేశవరం ఎన్టీఆర్ కాలనీలో రూ. 49.00 లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించనున్న నాలుగు సీసీ రోడ్ల పనులకు సోమవారం స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, అధికారులతో కలిసి ఆయన కాలనీలో పర్యటించారు. ఈ పర్యటనలో స్థానిక ప్రజలు మంచినీరు, విద్యుత్ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే... ఆర్.డబ్ల్యూ.ఎస్, విద్యుత్ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి, ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండపేట మండల టీడీపీ అధ్యక్షుడు కర్రి తాతారావు, ఎంపీపీ ఉండమట్ల వాసు, కంటిపూడి శ్రీను, ఉండమట్ల సురేష్, ఆళ్ల రాజుబాబు మరియు ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్