test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రూ.30 లక్షలతో నిర్మితమైన పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు

3 రోజుల క్రితం

MLA Bandaru inaugurated the works constructed
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 04, 2026, 02:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – ఆలమూరు  :  మండలంలోని చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయంలో దేవస్థానం నిధులు రూ.30 లక్షలతో చేపట్టిన ప్రదక్షిణ గ్రానైట్ చప్టా నిర్మాణం, క్యూలైన్ మార్గం వద్ద కాంక్రీట్ పనులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గురువారం    ప్రారంభించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ..  ఆలయానికి తరలివచ్చే యాత్రికులకు అవసరమైన ప్రతీ సౌకర్యాన్ని కల్పించామన్నారు. దాతలు, దేవస్థానం సమన్వయంతో  ప్రతి శుక్రవారం, అమావాస్య రోజున అన్నదానం చేయనున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలను ప్రశంసిస్తూ, రానున్న 50వ చండీ హోమానికి పూర్తిస్థాయి యాగశాల నిర్మించి నిర్వహించాలని సూచించారు. ఈ అంశంపై దేవస్థానం ఈవో ఉండవల్లి వీర్రాజు చౌదరి, చైర్మన్ వీరి అప్పారావులు యాగశాల ఏర్పాటు చేస్తామన్నారు. నూతనంగా ప్రతీ పౌర్ణమికి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించే విధంగా దేవస్థానం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నేతలు ఆకుల రామకృష్ణ, పాలూరి సత్యానందం, ఈదల సత్తిబాబు, నీటి సంఘాల అధ్యక్షులు గారపాటి శ్రీనివాస్, వైట్ల గంగరాజు, ఎంపీడీవో ఏ.రాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్