ప్రజాశక్తి-కాకినాడ : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కాకినాడ డిపో నుండి యమునా పుష్కరాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోందని డిపో మేనేజర్ ఎంయువి మనోహర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 10వ తేదీన ఉదయం 11గంటలకు కాకినాడ డిపో నుండి స్టార్ లైనర్, సూపర్ లగ్జరి బస్సులు బయలుదేరతాయని అన్నారు. 11రోజుల పాటు జరిగే ఈ యాత్రలో సింహాచలం, భువనేశ్వర్, కోణార్క్, పూరి, అయోధ్య, కాశీ, ప్రయాగరాజ్, గయ, బుద్ధగయ, జాజ్ పూర్, ఆగ్రా, బృందావనం, మధుర (యమునా పుష్కర స్నానం) తదితర పుణ్యక్షేత్రాల పర్యటన ఉంటుందన్నారు. స్టార్ లైనర్ (నాన్ ఏసీ బెర్త్) టిక్కెట్ ధర రూ.17 వేలు, సూపర్ లగ్జరి (2+2సీటింగ్,పుష్ బ్యాక్, టీవీ సౌకర్యం) రూ.13,300 లు గా నిర్ణయించామన్నారు. ప్రయాణంలో ఉదయం, రాత్రి అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇతర ఖర్చులు, దేవాలయాలలో పూజలు, దర్శనం టిక్కెట్లు ప్రయాణికులే భరించాలని మనోహర్ అన్నారు. ఇతర సమాచారం కోసం ఫోన్ నెంబర్లు 7382910869, 9912421137, 7382910769 అసిస్టెంట్ మేనేజర్ ను 9492833885ను సంప్రదించాలని సూచించారు.
యమునా పుష్కరాలకు కాకినాడ నుండి ప్రత్యేక బస్సులు
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 05, 2026, 04:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)