test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బతకాలి.. ఉపాధి హామీ పని ఇవ్వండి ..!

25 మే, 2026

https://prajasakti.com/district-news/provide-guaranteed-employment-for-life
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 25, 2026, 11:59 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-యు.కొత్తపల్లి (కాకినాడ) : ఉపాధి హామీ పనులు కల్పించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని వ్యవసాయ కార్మికుల సంఘం, ప్రజా సంఘాల నాయకులు గుర్రాల అప్పారెడ్డి హెచ్చరించారు. తమ ఫీల్డ్ అసిస్టెంట్ తమకు ఉపాధి పని కల్పించడం లేదని కొత్తపల్లి ఎంపీడీవో కార్యాలయం వద్ద నాగులపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు. 125 రోజులు పని అని చెప్పి 20 రోజులు పని కూడా తమకు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. తక్షణమే తమకు తమ గ్రామంలో ఉపాధి పనులు కల్పించాలన్నారు. మూడు వారాల పని చెప్పి వర్క్ ఆర్డర్ లేదంటూ ఫీల్డ్ అసిస్టెంట్ చెబుతున్నారని, ఏడాదిలో మూడు వారాలు పని చెప్పడానికే వర్క్ ఆర్డర్ లేదంటే నిరుపేద ప్రజలు ఎలా బతకాలంటూ మండిపడ్డారు. మండలంలో అన్ని గ్రామాలలో ఉపాధి పని కల్పిస్తుంటే తమ గ్రామంలో ఎందుకు ఉపాధి హామీ పథకం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ కావాలనే పని కల్పించడం లేదని ఆరోపించారు. తమ బాధను ఏపిఓ కి చెప్పాలని వచ్చామన్నారు.అయితే ఆయన అందుబాటులో లేరని ఆయన వచ్చేవరకు ఇక్కడ ఆందోళన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి శ్రామికులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్