test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజలపై భారాలు వేసే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించండి

21 మే, 2026

protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 21, 2026, 02:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- తాడేపల్లి రూరల్ (గుంటూరు) : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అనంతరం రెండుసార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిందని, సామాన్యుడిపై భారాలు పెంచే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని సిఐటియు తాడేపల్లి మండల కన్వీనర్ పల్లె కృష్ణ అన్నారు. ఎంటిఎంసి పరిధిలోని కుంచనపల్లి గ్రామ సచివాలయం వద్ద గురువారం ఉదయం సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల తో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి కృష్ణ మాట్లాడుతూ బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరంకుశ వైఖరితో ప్రజలపై భారాలు వేసేందుకు పూనుకుందని అన్నారు. ప్రజలపై భారాలు వేయడమే పనిగా మోడీ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. ఒకవైపున నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వలన నిత్యవసర ధరలు విపరీతంగా పెరుగుతాయని అన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని సిఐటియు డిమాండ్ చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తాడేపల్లి మండల కార్యదర్శి కాజా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన ఎన్డీఏ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం అన్యాయం అన్నారు. ఇప్పటికే పెరిగిన గ్యాస్ ధరలతో ప్రజల సతమతం అవుతుంటే పెట్రోల్ డీజిల్ ధరలు రెండుసార్లు పెంచటం ప్రజల నెత్తిన మరింత భారాలు వేయటానికేనని ఆయన విమర్శించారు. రష్యా కారు చౌకగా ఆయిల్ సరఫరా చేస్తామన్న ట్రంప్ ఆదేశాలకు మోడీ తలోగ్గారాని అన్నారు.వెంటనే కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు అమ్మిశెట్టి రామారావు, నల్లపు లెనిన్, పారిశుద్ధ్య కార్మికులు కోటేశ్వరి, చిన్నప్ప, రాంబాబు, సుజాత, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్