test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కరెంట్ షాక్ తగిలి వృద్ధురాలు మృతి

25 మే, 2026

Elderly Woman Dies After Receiving Electric Shock
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 25, 2026, 12:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-తెనాలి రూరల్ (గుంటూరు) : స్థానిక నాజరుపేటలో సోమవారం ఉదయం విషాద ఘటన జరిగింది. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో విద్యుత్ షాక్ కు గురై సయ్యద్ ప్యారి జాన్ (68) అనే వృద్ధ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం రాత్రి వీచిన ఈదురుగాలుల కారణంగా ఘటనా స్థలంలో విద్యుత్ సర్వీస్ వైర్ జారి వేలాడుతున్నట్లు సమాచారం. నేలరాలిన కొబ్బరి బోండాలను సేకరించే క్రమంలో సర్వీస్ వైరు తాకి ఈ ప్రమాదం జరిగినట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు. ఘటనపై పూర్తి సమాచారం విచారణలో తెలియాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగా మృతురాలి కుటుంబ సభ్యులు వివరాలు తెలిపేందుకు నిరాకరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్