ఉంగుటూరు (ఏలూరు) : ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నల్లమడు గ్రామ శివారులో తల్లీకూతుళ్ల మృతదేహాలు కలకలం రేపాయి. సోమవారం ఉదయం దూబచర్ల- చేబ్రోలు మార్గంలోని జీడిమామిడి తోటలో రెండు మృతదేహాలను గుర్తించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతులు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన మడ్డ వెంకటలక్ష్మి (46), గంటా ఆంతూ భాయ్ (60) తల్లీకూతుళ్లుగా గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో ఒకరి తలకు బలమైన గాయమైనట్లు తెలుస్తోంది. ఇది హత్యేనా ? ఇంకేమైనా కారణాలున్నాయా ? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
నల్లమడులో తల్లీ కూతుళ్ల మృతదేహాలు
01 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 01, 2026, 12:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)