test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కోరుకొండలో టిప్పర్ ఢీకొని యువకుడు మృతి..

18 మే, 2026

కోరుకొండలో టిప్పర్ ఢీకొని యువకుడు మృతి..
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 18, 2026, 11:24 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయింపు, ఉద్రిక్తత!

ప్రజాశక్తి-కోరుకొండ : తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ పరిధిలోని జంబుపట్నంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మట్టి లోడ్‌తో అతివేగంగా వచ్చిన ఒక టిప్పర్ లారీ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  నొక్కి రాజు వర్మ (27) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంపై  సమాచారం అందుకున్న వైసిపి నేత, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైసిపి నాయకులు ఘటన స్థలానికి చేరుకుని ధర్నాకు దిగారు. రాత్రివేళల్లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతూ, మితిమీరిన వేగంతో లారీలు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ మృతదేహంతో రోడ్డుపైనే బైఠాయించి ధర్నాకు దిగారు. దీనివల్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోవడంతో, డీఎస్పీ నేతృత్వంలో భారీగా పోలీస్ బలగాలు రంగంలోకి దిగి నిరసనకారులను శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోరుకొండ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్