test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ గ్రామ సభలు : ఎమ్మెల్యే వేగుళ్ళ

3 రోజుల క్రితం

MLA Vegulla holds revenue village assemblies
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 04, 2026, 02:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- కపిలేశ్వరపురం: భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన రెవిన్యూ గ్రామ సభలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. కపిలేశ్వరపురం మండల పరిధి వల్లూరు లో గురువారం జరిగిన `నెలలో ఒక గ్రామం నాలుగుసార్లు సందర్శన’ అనే కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. 2019 లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు వంద సంవత్సరాల తరువాత తామే భూములను రీసర్వే చేసి రైతులకు భూ సమస్యలు లేకుండా చేస్తున్నామని చెప్పి రైతుల భూములను రీ సర్వే చేయించారన్నారు. అప్పటినుండి భూ సమస్యలు తీరకపోగా రైతుల కష్టాలు రెట్టింపు అయ్యాయన్నారు. భూముల రీ సర్వే తప్పులు తడక గా తయారైందని విమర్శించారు. రీ సర్వే సందర్భంగా జగన్ బొమ్మ తో తయారు చేయించిన సర్వే రాళ్ళు కు ఖర్చుచేసిన ఏడు వందల కోట్లు ప్రజా ధనం దుబారా ఖర్చు గా మిగిలిందన్నారు. ఆనాటి రీ సర్వే లోపాలు కూటమి ప్రభుత్వానికి గుదిబండగా తయారైందని అన్నారు.  ఆ తప్పులను సరిచెయ్యాలనే సంకల్పం తో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు నిర్వహిస్తున్న నెలలో నాలుగు సార్లు గ్రామల సందర్శన గ్రామ సభలు ను రెవెన్యూ సమస్యలు పరిష్కారం కొరకు రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆన్ లైన్ రికార్డులు లో భూమి హెచ్చు తగ్గులు, ఒకే ఎల్ పి నంబర్ పై పలువురు రైతుల పేర్లు నమోదు వంటి పలు సమస్యలు ను ఈ రెవెన్యూ గ్రామ సభలు లో పరిష్కరించుకోవాలని  రైతులకు విజ్ఞప్తి చేశారు. ఆన్ లైన్ లో రెవెన్యూ సమస్యలు పరిష్కారం అయితేనే భూ క్రయ విక్రయాలు సజావుగా జరుగుతాయని వివరించారు. అనంతరం రైతులు నుండి భూ సమస్యలు పై వినతులు స్వీకరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్