నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు
— జిల్లా ఉపాధి అధికారి సి హెచ్ శిరీష
ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ : తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సి హెచ్ శిరీష గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమండ్రి రూరల్ కలెక్టర్ ప్రాంగణంలో మే 30వ తేదీ (శనివారం) ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరగనుందని అన్నారు. ఈ మేళాలో ప్రముఖ కంపెనీలైన లైన్ స్పయర్ సాఫ్ట్ వేర్ల్ సొల్యూషన్స్, రవళి స్పిన్నర్స్, ఠాగూర్ లాబోరేటోరీస్, అవంతి ఫ్రోజెన్ ఫుడ్స్, కియా మోటార్స్, లార్సెన్ & టర్బో, ఆకాశం హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్, మెడ్ ప్లస్, టీమ్ లీజ్ సంస్థలలోని పలు రకాల పోస్టుల భర్తీ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్ఎస్‌సి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, ఏదైనా డిగ్రీ, ఎంబీబీఎస్, ఫార్మసీ, నర్సింగ్, ఎంబీఏ పూర్తి చేసి, అనుభవం ఉన్న లేదా ఆసక్తి గల 19 నుండి 32 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులని వివరించారు. ఎంపికైన వారికి తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా employment.ap.gov.in లింక్ ద్వారా తమ పూర్తి వివరాలతో నమోదు చేసుకుని, రెజ్యూమ్, ఆధార్ కార్డు, సంబంధిత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో జాబ్ మేళాకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9533221189 నంబర్‌ను సంప్రదించవచ్చని జిల్లా ఉపాధి అధికారి శిరీష తెలిపారు.








కామెంట్‌లు (0)