కార్పోరేట్ సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
చాగల్లు మండలం. పి. ఎమ్ శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఊనగట్ల విద్యార్థిని
ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభ చాటారు. అంతేకాకుండా …. 1966 కాలం నుండి కొనసాగుతోన్న పి. ఎమ్ శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రైవేటు స్కూళ్లకు దీటుగా అన్ని వసతులు ఏర్పాటయ్యాయి. చదువుతోపాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణిస్తూ తమ సత్తా చాటుతున్నారు. మంగళవారం చాగల్లు మండలంలోని ప్రభుత్వ స్కూలు ప్రధానోపాధ్యాయులు ఎన్వి.రమణ వివరాలను వెల్లడించారు. సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో నందిగం.భవజ్ఞ 574 మార్కులతో మండలం ప్రథమ స్థానం, చిటికెన. హేమ లక్ష్మి 573 మార్కులతో ద్వితీయ స్థానం సాధించారు. క్రీడా పోటీల్లో కూడా ఊనగట్ల విద్యార్థినిలు రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలలో ద్వితీయ స్థానం, జాతీయస్థాయి బీచ్ వాలీబాల్ పోటీల్లో 4వ స్థానం సాధించి అనేక పతకాలను సాధించారు. ఈ సంవత్సరం పదిమంది రాష్ట్రస్థాయి పోటీల్లోనూ పాల్గొన్నారు. పంతకాని.లాస్య 9వ తరగతి చదువుతుండగా 3 సార్లు జాతీయస్థాయి వాలీబాల్, బీచ్ వాలీబాల్ పోటీల్లో పాల్గొన్నారు. కంచర్ల హనీ 7వ తరగతి చదువుతూ బీచ్ వాలీబాల్ పోటీలలో పాల్గొన్నారు. పి ఎమ్ శ్రీ స్కూల్ లో 5 ఐదు రకాల క్రీడా కోర్టులు, 52 మంది విద్యార్థులతో భారత్ స్కౌట్ అండ్ గైడ్ దళం, కిచెన్ గార్డెన్, ఐడి కార్డ్స్, విశాలమైన ఆట స్థలాలు, సురక్షితమైన మంచినీరు వంటి సౌకర్యాలు కల్పించారు. ఊనగట్ల విత్తన విశాల పరిమితి సంఘం వారి ఆర్థిక సహాయంతో ప్రహరీ గోడ ఎత్తు పెంపుదల నిమిత్తం స్కూలు అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నందిగం శ్రీనివాసరావు గేట్ ఆర్థిక సాయంతో ఏర్పరిచారు. పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయంతో సిక్కు రూము, భారతరత్న రాజ్యాంగం రూపశిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వారి విగ్రహం, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వంటి అభివృద్ధి పనులు ఏర్పాటు చేశారు. ఇటీవల స్కూల్లో సోలార్ ప్లాంట్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ పాఠశాల ఏర్పాటుకు1966 లో స్థలదాత కీర్తి శేషులు నందిగం.సూర్యారావు 2 ఎకరాలు దానంగా ఇచ్చారు అని ప్రధానోపాధ్యాయులు ఎన్వి.రమణ తెలిపారు.








కామెంట్‌లు (0)