test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాజమండ్రిలో చైన్ స్నాకర్స్ హల్చల్

4 రోజుల క్రితం

Chain Snatchers Create Havoc in Rajahmundry
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 03, 2026, 03:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం సిటీ (తూర్పు గోదావరి) : రాజమహేంద్రవరం సిటీలో చైన్ స్నాకర్స్ మరోసారి రెచ్చిపోతున్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళల ఆభరణాలను దోచుకుంటున్నారు. వేగంగా బైక్ పై వచ్చి బలవంతంగా మెడలోని ఆభరణాలను లాక్కుంటున్నారు. ఒకరు బైక్ నడుపుతుండగా వెనకాల కూర్చున్న వ్యక్తి వాటిని కాజేస్తున్నాడు. బుధవారం ఉదయం ఐదున్నర గంటలకు దానవైపేట లో నడిచి వెళుతున్న మహిళ మెడ నుంచి బంగారు ఆభరణాలు దొంగిలించారు. అనంతరం 5:40 నిమిషాలకు లాల చెరువు సర్వీస్ రోడ్డులో నడిచి వెళుతున్న ఆభరణాలు కాజేశారు. ఇద్దరు యువకులు 220 బైక్ పై బుధవారం ఉదయం నగరంలోనే వివిధ ప్రాంతాల్లో హల్చల్ చేశారు. పోలీసులు సేకరించిన నగరంలోనే ప్రధాన కూడళ్లలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్లను తీసుకున్నారు. వాటి ఆధారంగా 220 బైక్ పై డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి తెల్ల షర్టు హెల్మెట్ ధరించినట్టుగా నిర్ధారణకు వచ్చారు. మరో వ్యక్తి ఎరుపు రంగు షర్టు నల్ల ప్యాంటు ధరించి బైక్ వెనకాల కూర్చుని ఒంటరి మహిళల నుంచి బంగారు ఆభరణాలు చైన్ స్నాకింగ్ చేస్తున్నట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్