ప్రజాశక్తి- కలకడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యాహ్నం భోజనం పథకం ద్వారా విద్యార్థులకు పోషక విలువలతో కూడిన భోజనం అందించాలని మండల విద్యాశాఖ అధికారి -2 రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రమైన కలకడ ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ సభ్యులకు ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏజెన్సీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన, పోషక విలువలతో కూడిన భోజనాన్ని వడ్డించాలన్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వస్తుంటారని, వారికి రుచికరమైన మంచి భోజనం వడ్డించి పాఠశాల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. మెనూ ప్రకారం ఆహారం వడ్డించి, వంట పాత్రలు, వంటగదులను శుభ్రంగా ఉంచుకుని మంచి రుచికరమైన భోజనం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ సభ్యులు, మానవ వనరుల కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు పోషక విలువలతో కూడిన భోజనం అందించాలి
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 04, 2026, 04:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)