test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేయాలి

3 రోజుల క్రితం

anganwadi-centers-should-be-strengthened
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 04, 2026, 04:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

 ప్రజాశక్తి- కలకడ: అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు తల్లిదండ్రు సహకరించాలని అంగన్వాడీ కార్యకర్త కుసునమా పేర్కొన్నారు.  మండల కేంద్రమైన కలకడ గుర్రంకొండ రోడ్డులో ఉన్న అంగన్వాడి కేంద్రం-2 పరిసర ప్రాంతాలను పర్యటించి,  మూడు సంవత్సరాలు పైబడిన విద్యార్థిని విద్యార్థులను అంగన్వాడీలు చేర్పించేందుకు తన వంతు కృషి చేస్తున్నట్టు తెలిపారు. గురువారం `అంగనవాడి పిలుస్తుంది’ కార్యక్రమంలో భాగంగా కొంతమంది విద్యార్థులను తమ అంగన్వాడి కేంద్రంలో చేర్పించుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. తల్లిదండ్రుల సహకారంతో అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేయడానికి సహకరించి, చిన్నారుల భవిష్యత్తుకు బాటలు వేయాలని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు తమ కేంద్రంలో చేర్పించాలంటూ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్