test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వరి గడ్డికి భలే గిరాకి

13 మే, 2026

vari gaddi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 13, 2026, 03:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు మండలంలో బియలేరు మాదిగుబ్బ మాగాణి కింద సాగు చేస్తున్నారు. మొక్కజొన్న పంటను రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నడంతో పశుగ్రాస కొరత ఏర్పడుతుంది. కొందరు ట్రాక్టర్‌ యజమానులు,కణేకల్ మాగాణి కింద వరిగడ్డిని కొనుగోలు చేసి గ్రామాల్లోనికి తెచ్చి ట్రాక్టర్‌ రూ 15 వేలకు అమ్ముతున్నారు. దీంతో పశువుల యజమానులు పశుగ్రాసం కోసం అధిక రేటు పెట్టి వరిగడ్డిని కొనుగోలు చేస్తున్నారు. అధిక విస్తీర్ణంలో వరిని సాగు చేసే సమయంలో రైతులు వరిగడ్డిని ఉచితంగా ఇచ్చేవారు. వరి సాగు తక్కువగా ఉండడంతో వరిగడ్డికి గిరాకీ ఏర్పడడంతో రైతులు ఎకరా వరిగడ్డిని రూ 2500 లకు అమ్ముతున్నారు. ట్రాక్టర్‌ కు ఎకరాన్నర నుండి రెండు ఎకరాల గడ్డి పడుతుంది. వరిగడ్డికి మంచి డిమాండ్‌ ఏర్పడిందని రైతులు తెలుపుతున్నారు. ట్రాక్టరు బాడుగ కూలీ ఖర్చులతో ట్రాక్టర్‌ వరిగడ్డి 13 వేల నుండి 15 వేలకు ధర పలుకుతుందని రైతులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్