రాయదుర్గం (అనంతపురం) : పంచాయతీకి చెందిన బోరును మరమ్మతు చేస్తూ పైపులను దించుతుండగా… 11 కెవి కరెంటు తీగలు తగిలి తండ్రీ కొడుకు మరణించిన దుర్ఘటన శుక్రవారం అనంతపురంలోని గుమ్మగట్ట మండలం కరిసూరయ్య దొడ్డి గ్రామంలో జరిగింది. రాయదుర్గం మండలం బొమ్మక పల్లి గ్రామానికి చెందిన ఆనంద్, అతని కుమారుడు తేజ కలిసి విద్యుత్ సర్వీసు పనులు చేస్తూ జీవనం సాగించేవారు. ఈరోజు కరిసురయ్య దొడ్డి గ్రామంలో పంచాయతీకి చెందిన బోరును మరమ్మతు చేస్తూ పైపులు దించుతుండగా 11 కెవి విద్యుత్ తీగలు తగిలి వారిద్దరికీ కరెంటు షాక్ తగిలింది. వెంటనే వారిని రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి కొడుకులు ఈ ప్రమాదంలో మరణించడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. గుమ్మగట్ట పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కరెంటు షాక్ తగిలి తండ్రీ కొడుకు మృతి
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 05, 2026, 04:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)