ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు మండలంలో గురువారం రాత్రి వీచిన ఈదురుగాలులు, అకాల వర్షానికి మండలంలోని అరటి, బొప్పాయితో పాటు విద్యుత్ స్తంభాలు పడి కరెంటు లేక బ్యాంక్ అధికారులు, సచివాలయ సిబ్బంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈదురుగాలులకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆత్మకూరుకి చెందిన రైతు ఆవుల మాధవరెడ్డి తన పొలంలో వేసిన నాలుగు వేలు బొప్పాయి చెట్లు పంట చేతికి వచ్చే టైంలో రాత్రి వీచిన ఈదురుగాలులకు నేలమట్టమయ్యాయి. సుమారు10 లక్ష రూపాయల వరకు నష్టపోయారని రైతు వాపోయారు. మండల కేంద్రంలో విద్యుత్తు వైర్లపైన చెట్లు విరిగి పడడంతో 5 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈదురుగాలులకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైతులు వేడుకొంటున్నారు.
అకాల వర్షానికి నేలకొరిగిన అరటి, బొప్పాయి
22 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 22, 2026, 03:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)