test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నడింపల్లిలో భూ రీసర్వే 9(2) నోటీసుల పంపిణీ

4 రోజుల క్రితం

resurvey
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 03, 2026, 01:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అచ్యుతాపురం : ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం నడింపల్లి రెవిన్యూ గ్రామంలో రీ సర్వే అధికారులు బుధవారం నుంచి జీరాయితీ (ప్రైవేటు) భూముల యజమానులకు 9(2) నోటీసులను పంపిణీ చేశారు. గ్రామంలోని భూములు కలిగిన రైతులు తప్పనిసరిగా హాజరై తమకు సంబంధించిన నోటీసులను స్వీకరించాలని కోరారు. అలాగే భూముల సర్వే సమయంలో భూములకు సంబంధించిన రెవెన్యూ రికార్డులు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఇంకా అందజేయని భూయజమానులు వాటిని తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. భూ రీసర్వే ప్రక్రియ సజావుగా సాగేందుకు రైతులు, భూయజమానులు రీసర్వే బృందానికి పూర్తిస్థాయిలో సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. దీంతో భూ వివరాల నమోదు, రికార్డుల నవీకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నడింపల్లి విఆర్ఓ రామకృష్ణ, సర్వేయర్ సాయి, విఆర్ఎ నూకరాజు, మాజీ వైస్ సర్పంచ్ పైడిరాజు, స్థానిక నాయకులు, భూ యజమానులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్